నెస్లే శిశువుల ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన ప్రధాన బేబీ న్యూట్రిషన్ ఉత్పత్తులలో ప్రమాదకరమైన టాక్సిన్ ఉన్నట్లు గుర్తించి, ప్రపంచ వ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నెస్లే చరిత్రలోనే ఇది అతిపెద్ద రీకాల్ కాగా అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ రీకాల్‌ను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. నెస్లే విక్రయించే ప్రముఖ బ్రాండ్లు అయిన SMA, BEBA, NAN శిశువుల ఫార్ములా పాలు ఈ రీకాల్ పరిధిలోకి వచ్చాయి. ఒక ప్రముఖ సరఫరాదారు నుంచి సేకరించిన పదార్ధంలో నాణ్యత లోపం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనివల్ల ఆ ఉత్పత్తుల్లో 'సిర్యూలైడ్' అనే టాక్సిన్ ఉండే ప్రమాదం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. ఇది బాసిల్లస్ సిర్యస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టాక్సిన్ కలిగిన ఆహారాన్ని శిశువులు తీసుకుంటే తీవ్రమైన వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిపై బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేస్తూ.. ఈ విష పదార్థం మరిగించడం వల్ల గానీ, వేడి నీటిని ఉపయోగించడం వల్ల గానీ నశించదని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఈ ఉత్పత్తుల వల్ల ఎవరికీ అనారోగ్యం కలిగినట్లు ఆధారాలు లేవని నెస్లే తెలిపింది. కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
SMA, BEBA, NAN శిశువుల ఫార్ములా పాలను రీకాల్ చేసిన నెస్లే !
الأربعاء، 7 يناير 2026
arogyam BEBA clarified that the recall is being done purely as a precautionary measure health international NAN infant formula milk Nestlé recalls SMA worldwide after discovering a dangerous toxin
ليست هناك تعليقات:
إرسال تعليق