శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ Galaxy M17e 5G రాబోతోంది. ఈ ఫోన్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ డివైస్ గూగుల్ పే కన్సోల్ సపోర్ట్ డివైస్ లిస్టింగ్‌లో కనిపించింది. ఇందులో ఫోన్ మోడల్ నంబర్ SM-M076Bగా, అలాగే, కోడ్ నేమ్ "A07x"గా నమోదైంది. ఇది త్వరలో లాంచ్ కానున్న Galaxy A07 5G ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. మొదట్లో శాంసంగ్ డివైస్ మోడల్ నంబర్ ప్యాటర్న్ ప్రకారం దీనిని Galaxy M07 5Gగా లాంచ్ చేస్తారని అందరూ అంచనా వేశారు. కానీ గూగుల్ పే కన్సోల్ లిస్టింగ్‌లో మాత్రం స్పష్టంగా Galaxy M17e 5G పేరుతో కనిపించడం గమనార్హం. "e" సఫిక్స్‌ను సాధారణంగా అత్యంత తక్కువ బడ్జెట్ ఫోన్లకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు శామ్‌సంగ్ ఈ నేమింగ్‌ను Galaxy A0Xe, అలాగే వాటి రీబ్రాండెడ్ M0Xe, F0Xe సిరీస్‌లకు మాత్రమే ఎక్కువగా ఉపయోగించింది. కానీ, Galaxy M1X లైనప్‌లో "e" సఫిక్స్ వాడటం చాలా అరుదు అని చెప్పాలి.. అందుకే ఈ పేరు ఎంపిక టెక్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా, ఇటీవల మార్కెట్లో అనేక మొబైల్ కంపెనీలు తమ నేమింగ్ వ్యూహాలను మార్చుకుంటున్న నేపథ్యంలో, శామ్‌సంగ్ కూడా అదే బాటలో కొత్త బ్రాండింగ్ ప్రయోగాలు చేస్తుండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో 6.7 - 6.8 అంగుళాల క్లాస్ స్క్రీన్, MediaTek Dimensity 6300 చిప్‌సెట్, 8GB ర్యామ్, Android 16 ఆధారిత One UI 8 ఓఎస్, 6,000mAh బ్యాటరీ.
ホーム
/
technology
/
శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ Galaxy M17e 5G ?
الجمعة، 9 يناير 2026
6.7-6.8 inch class screen Is the Galaxy M17e 5G a budget phone from Samsung? MediaTek Dimensity 6300 chipset science smart phone technology
ليست هناك تعليقات:
إرسال تعليق