పింటెరెస్ట్ కొనుగోలుకు ప్రణాళిక రూపొందించుకుంటున్న ఓపెన్ ఏఐ ?

الثلاثاء، 6 يناير 2026

'The Information' published an exclusive report on this Is OpenAI planning to acquire Pinterest? particularly for product research science technology

t f B! P L


పెన్ ఏఐ డేటా విస్తరణ వ్యూహంలో భాగంగా పింటెరెస్ట్ ను కొనుగోలు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటోంది. 'ది ఇన్ఫర్మేషన్' దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక కథనాన్నిప్రచురించింది. ప్రత్యేకించి - ప్రొడక్ట్ రీసెర్చ్ కు సంబంధించి డేటా విస్తరణ, హ్యూమన్ మానవ- జనరేటెడ్ డేటా ఇన్ సైట్స్ ను పొందడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం.ఈ బిగ్ డీల్ తో ఛాట్ జీపీటీని ఓ షాపింగ్ టూల్‌గా మార్చుకోవాలని, దీని ద్వారా అడ్వర్టయిజ్మెంట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని ఓపెన్ ఏఐ భావిస్తోన్నట్లు ది ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. ఓపెన్ ఏఐ తన సొంత సోషల్ లేదా సెర్చ్ నెట్‌వర్క్ లేదా రియల్ టైమ్ యూజర్ ఇన్ సైట్స్ ను సాధించడంలో మెటా, ఎక్స్ఏఐ, గూగుల్ వంటి దిగ్గజాల కంటే భిన్నంగా వ్యవహరించలేకపోతోంది. వాటితో పోల్చుకుంటే కాస్త వెనుకంజలో ఉంది. దీనికోసం థర్డ్ పార్టీ డేటా వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి పింటెరెస్ట్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణకు డేటా విలువ పెరుగుతున్నందున దీనికి సంబంధిత ఇన్ సైట్స్ ను పొందడం ఓపెన్ ఏఐకి సవాలుగా మారింది. గూగుల్, మెటా వంటి తన కాంపిటీటర్స్ నిరంతరం యూజర్లకు అవసరమైన భారీ డేటాను అందిస్తోన్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ ఇటీవలే న్యూస్ కార్ప్, కాండె నాస్ట్, డిస్నీ వంటి న్యూస్ అవుట్ లెట్స్ తో కంటెంట్ లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకుంది. ఈ పార్ట్ నర్ షిప్ సోరా, ఛాట్ జీపీటీ యూజర్లకు డిస్నీ క్యారెక్టర్స్ తో కూడిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోల సృష్టించడానికి వీలు కల్పించినట్టయింది. ఈ ఒప్పందాలు ఖర్చుతో కూడుకున్నవి. అందుకే- ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యాప్‌ను కొనుగోలు చేయడం ద్వారా సంబంధిత ఎంగేజ్‌మెంట్ డేటా, రీసెర్చ్, ప్రొడక్ట్స్, బ్రాండింగ్ ఇన్ సైట్స్ వంటి వివరాలను ట్రాక్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని ఓపెన్ ఏఐ భావిస్తోంది. పింటెరెస్ట్ కు సొంతంగా ఏఐ టూల్స్, అల్గోరిథం అందుబాటులో ఉన్నాయి. 600 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ