తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ది పొందని వారి కోసం మరో అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. అర్హత ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అందు కోసం వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కొత్తగా విధి విధానాలు ఖరారు చేసింది. ప్రతీ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజా పాలన అధికారులను నియమించిన ప్రభుత్వం వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో చేర్చనున్నారు. గతంలో కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొర్లడంతో పథకాలకు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. తమ ప్రభుత్వంలో లబ్దిదారులకు అందరికీ పథకాలు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డు వచ్చినవారు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందినవారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీవో ఆఫీసులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపల్ వార్డుల్లో కూడా ప్రజా పాలన అధికారులను నియమిం చింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. గతంలో దర ఖాస్తు చేసుకోనివారితో పాటు గతంలో తప్పుల వల్ల లబ్ది పొందనివారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం కోసం ఆధార్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాలి. ఇక మహాలక్షి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లబ్దిదారులకు నేరుగా అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు.
సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
الثلاثاء، 6 يناير 2026
given another chance to those who are eligible for welfare schemes but have not benefited yet Gruha Jyoti and Mahalaxmi schemes Telangana government
ليست هناك تعليقات:
إرسال تعليق