ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ : వద్దన్నా వినకపోవడంతో దారుణ హత్య

الخميس، 1 يناير 2026

Brutal murder after ignoring warnings to stop Chatting with a young woman on Instagram Chikkamagaluru district karnataka Udeva village in Tarikere taluk

t f B! P L


కర్ణాటకలోని మంజునాథ్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్‌లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిక్కమంగళూరు జిల్లా, తారికెరె తాలూకా, ఉదెవా గ్రామానికి చెందిన మంజునాథ్ అనే 21 ఏళ్ల యువకుడు తనకు ఇన్‌స్టాలో పరిచయం ఉన్న అమ్మాయికి తరచుగా మెసేజ్‌లు చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయికి నిశ్చితార్థం అవ్వటంతో 'నాకు నిశ్చితార్థం అయింది. ఇకపై మెసేజ్‌లు చేయొద్దు' అని గట్టిగా చెప్పింది. అయితే మంజునాథ్ ఆ యువతి మాటల్ని పట్టించుకోకుండా పదే పదే మెసేజ్‌లు చేస్తూ ఉన్నాడు. దీంతో విసుగు చెందిన యువతి తనకు కాబోయే భర్త వేణుకు విషయం చెప్పింది. అది విని వేణు ఆగ్రహానికి గురయ్యాడు. మంజునాథ్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితులు కిరణ్, అప్పు, మంజులను తన ప్లాన్‌లో భాగం చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం మంజునాథ్‌కు ఫోన్ చేసి మాట్లాడటానికి వేణును పిలిచాడు. అక్కడ వేణు, కిరణ్, అప్పు, మంజులు కలిసి మంజునాథ్‌ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మంజునాథ్‌ను స్థానికులు శివమొగ్గలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంజునాథ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. మంజునాథ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ