చైనాలో గర్భనిరోధక సాధనాల ధరలు పెంపు

السبت، 3 يناير 2026

a 13 percent value-added tax has been imposed on products From January 1st goal of maintaining population balance international Prices of Contraceptives Increase in China

t f B! P L


చైనాలో జనన రేటు క్రమంగా తగ్గుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా పెంపునకు ప్రోత్సాహక చర్యలపై దృష్టి సారించిన చైనా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న కొన్ని పన్ను మినహాయింపులను రద్దు చేయడంతో గర్భనిరోధక సాధనాల ధరలు పెరిగాయి. జనవరి 1 నుంచి గర్భనిరోధక మాత్రలు, కండోమ్ లు  వంటి ఉత్పత్తులపై 13 శాతం విలువ ఆధారిత పన్ను అమల్లోకి వచ్చింది. దీంతో ఇవి వినియోగించే వారికి అదనపు ఆర్థిక భారం పడుతోంది. జననాన్ని తగ్గించే సాధనాలపై రాయితీలను తొలగించడం ద్వారా కుటుంబ విస్తరణకు పరోక్షంగా ప్రోత్సాహం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. చైనాలో ఇటీవల కాలంలో యువత పెళ్లిని ఆలస్యం చేయడం, పిల్లలను కనాలనే ఆసక్తి తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. పిల్లల విద్య, వైద్యం, సంరక్షణ ఖర్చులు అధికంగా ఉండటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి, జీవన వ్యయాలు పెరగడం వంటి కారణాలతో చాలా మంది ఒకే పిల్లతోనే పరిమితమవుతున్నారు లేదా పిల్లలు లేకుండా జీవించడానికి మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో భారీ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం పిల్లల పెంపకానికి సబ్సిడీలు, పన్ను రాయితీలు, వివాహానికి ఆర్థిక ప్రోత్సాహకాలు, యువతకు లవ్ ఎడ్యుకేషన్ వంటి పలు విధానాలను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. జనాభా సమతుల్యతను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ