ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి అక్కడే ఉండిపోయిన భారత విద్యార్థులను స్వదేశం తీసుకురానుంది. ఇప్పటికే టెహ్రాన్‌లోని భారత కార్యాలయం అక్కడ వివిధ ప్రాంతాల్లోని ఇండియన్ స్టూడెంట్స్ గురించి ఆరా తీస్తోంది. రోజురోజుకు ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దాంతో. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్ సేవలు కూడా దాదాపు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు అక్కడే ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన ప్రభుత్వం వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం అక్కడి భారత విద్యార్థులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున స్వదేశం వెళ్లాలనుకునేవారిని తరలించేందుకు చర్యలు చేపట్టనుంది. రేపటి నుంచి బ్యాచ్‌ల వారీగా ఇండియాకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి ఇండియన్ ఎంబసీ సమన్వయతో పని చేయనుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారత విదేశాంగ శాఖ త్వరలోనే వెల్లడించనుంది.
ఇరాన్‌లో చిక్కుకున్న భారత విద్యార్దులను రేపటి నుంచి తీసుకురానున్న ప్రభుత్వం
الخميس، 15 يناير 2026
government will begin bringing back Indian students stranded in Iran from tomorrow international national ndian embassy in Tehran is already inquiring
ليست هناك تعليقات:
إرسال تعليق