ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయించడంపై వస్తున్న విమర్శలను మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చి, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే మా ప్రాధాన్యత. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే విశాఖప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అటువంటప్పుడు ఉపాధి కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల హబ్ సిద్ధమవుతోందని, రాబోయే పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని విశాఖ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విశాఖ ప్రజల ఆస్తి అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనివ్వబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా మంత్రి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలను స్వాగతిస్తామని, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడితే మాత్రం సహించబోమని హెచ్చరించారు.
రాబోయే పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని విశాఖ అధిగమిస్తుంది !
الأربعاء، 7 يناير 2026
Andhra Pradesh clarified that the steel plant is the property of the people of Visakhapatnam Minister Nara Lokesh Visakhapatnam will surpass Hyderabad's development in the next ten years
ليست هناك تعليقات:
إرسال تعليق