కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీల అమలు కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ నేతలను, వేలాది మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. పోలీస్ స్టేషన్లలో వారిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఆటో డ్రైవర్లకు రంగురంగుల హామీలిచ్చి, ఇప్పుడు వాటిని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. అరెస్టయిన ఆటో కార్మికులను, యూనియన్ నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు !
السبت، 3 يناير 2026
BRS Working President KTR called for a siege of the Assembly to demand Illegal arrest of auto drivers is unacceptable telangana
ليست هناك تعليقات:
إرسال تعليق