ఛత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కుంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగ్డు మరణించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. నక్సలైట్ల సంచారం ఉన్నట్టు సమాచారం అందడటంతో జిల్లాకు చెందిన రిజర్వ్ గార్డ్ పోలీసుల బృందం ఈ తెల్లవారుజామున రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి.
ホーム
/
Sachin Mangdu
/
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ లో 12 మంది నక్సల్స్ మృతి : భారీ స్థాయిలో ఆయుధాల స్వాధీనం
السبت، 3 يناير 2026
12 Naxals killed in encounter in Chhattisgarh a member of the Kunta Area Committee is among those killed large cache of weapons seized national Sachin Mangdu
ليست هناك تعليقات:
إرسال تعليق