రోజువారీ ఆఫీసు ప్రయాణం, చిన్న దూరాల ట్రావెల్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కోరుకునే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రేడియన్ ను రూపొందించారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్, హోండా షైన్ లాంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, టీవీఎస్ రేడియన్ వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ధర పరంగా మాత్రమే కాకుండా మైలేజ్, లాంగ్‌టర్మ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. టీవీఎస్ రేడియన్ ఆల్ బ్లాక్ ఎడిషన్ ధర రూ.55,400 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. బేస్ ఎడిషన్ ధర రూ.61,900, డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ.74,500, డిజి డిస్క్ వేరియంట్ ధర రూ.78,200గా ఉన్నాయి. ఈ బైక్ లీటర్‌కు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ అంచనా వేస్తుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లే సామర్థ్యం టీవీఎస్ రేడియన్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. ఈ బైక్‌ను హీరో స్ప్లెండర్, హోండా షైన్‌లకు గట్టి ప్రత్యర్థిగా చెప్పుకోవచ్చు. దీనిలో ఉపయోగించిన ఇంజిన్ ఈ బైక్‌కు ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. ఇది 109.7cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ దాదాపు 8.3 bhp శక్తిని, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ను 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయడం వల్ల, నగరంలో ట్రాఫిక్ మధ్య నడిపినప్పటికీ, అలాగే గ్రామీణ రోడ్లపై ప్రయాణించినప్పటికీ బైక్ చాలా స్మూత్‌గా స్పందిస్తుంది. దీనిలో 10-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వబడింది. కంపెనీ చెప్పే మైలేజ్‌ను పరిగణలోకి తీసుకుంటే, ఒకే ఫుల్ ట్యాంక్‌తో 750 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఈ బైక్‌కు ఉంది. ఇది రోజువారీ ప్రయాణాలకే కాదు, అప్పుడప్పుడు సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ బైక్‌ను ఏళ్ల తరబడి వాడినా పెద్ద సమస్యలు రావడం చాలా అరుదు. ఈ బైక్‌లో ఇచ్చిన బలమైన మెటల్ బాడీ రోజువారీ వినియోగంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను సులభంగా తట్టుకునేలా తయారు చేశారు. గ్రామీణ రోడ్లైనా, నగర ట్రాఫిక్ అయినా, దీని బాడీ నాణ్యత బైక్‌కు అదనపు నమ్మకాన్ని ఇస్తుంది. అలాగే, పొడవైన, వెడల్పైన సీటు కారణంగా రైడర్‌కే కాదు, వెనుక కూర్చునే వ్యక్తికీ సుదీర్ఘ ప్రయాణాల్లో సౌకర్యం లభిస్తుంది. ఇందులో ఉన్న సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ వల్ల ముందు, వెనుక బ్రేక్‌లు సమతుల్యంగా పనిచేస్తాయి.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కోరుకునే వినియోగదారుల కోసం టీవీఎస్ రేడియన్
الخميس، 8 يناير 2026
automobile business Despite strong competitors like the Hero Splendor and Honda Shine in this segment technology TVS Radeon: For Consumers Seeking Maximum Utility at a Low Cost
ليست هناك تعليقات:
إرسال تعليق