ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తాజాగా బ్లింకెట్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశారు. 'బోర్డు రూములకు దూరంగా అట్టడుగు స్థాయిలో.. ఐ లివ్డ్ దైర్ డే..' అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బ్లింకెట్ యూనిఫారం వేసుకున్న చద్దా డెలివరీ బ్యాగ్ తగిలించుకుని రైడర్‌తో కలిసి ప్రయాణం సాగించారు. స్టోర్‌లో వస్తువులు కలెక్ట్ చేసుకుని డెలివరీ లొకేషన్‌కు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే లిఫ్ట్ ఎక్కి రైడర్‌ను చద్దా అనుసరించారు. 'స్టే ట్యూన్డ్' అంటూ ఆ వీడియో ముగుస్తుంది. చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు. పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు. ఇలాంటి డెడ్‌లైన్‌ల వల్ల రైడర్లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది రాజ్యసభ జీరో అవర్‌లో చద్దా ప్రస్తావించారు. జనం రోబోలు కాదని, వాళ్లలోనూ తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు ఉన్నారని అన్నారు. వారి గురించి సభ ఆలోచించాలని కోరారు. 10 నిమిషాల్లో డెలివరీ అనే క్రూర నిబంధనకు తెరపడాలని అన్నారు. తాజాగా, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుకునేందుకు డెలివరీ బాయ్‌గా ఆయన అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ホーム
/
with the caption
/
బ్లింకెట్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా!
الاثنين، 12 يناير 2026
"Away from the boardrooms Aam Aadmi Party MP Raghav Chadha dons the role of a Blinkit delivery boy He posted a video related to this on his social media platform 'X' national with the caption
ليست هناك تعليقات:
إرسال تعليق