ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో అనుప్, సోనిలకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ నెల 7న సోని తన భర్తను వదిలేసి, సుర్జీత్ అనే వ్యక్తితో పారిపోయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు జనవరి 11న ఆమెను గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, పోలీసు కస్టడీలో ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సోని టిఫిన్ కోసం స్టేషన్ లోపల ఉన్న క్యాంటీన్ వైపు వెళ్తుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన భర్త అనుప్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. తన వద్ద ఉన్న ఆయుధంతో ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చాడు. తీవ్ర గాయాలైన సోనిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అత్యంత రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ లోపలికి నిందితుడు ఆయుధంతో ఎలా ప్రవేశించాడనేది చర్చనీయాంశంగా మారింది. లోపలికి వచ్చేటప్పుడు తనిఖీలు చేయలేదా?, పోలీసుల కస్టడీలో ఉన్న మహిళకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారా?, ఆయుధం నిందితుడికి ఎక్కడ నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై హర్దోయ్ ఎస్పీ అశోక్ కుమార్ మీనా తీవ్రంగా స్పందించారు. నిందితుడు అనుప్‌ను ఆయుధంతో సహా వెంటనే అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌లోనే భార్యను కాల్చి చంపిన భర్త !
الاثنين، 12 يناير 2026
Anup and Soni were married 17 years ago crime Hardoi district of Uttar Pradesh Husband shoots and kills wife inside police station national Soni left her husband and eloped with a man named Surjit
ليست هناك تعليقات:
إرسال تعليق