ఢిల్లీ మెట్రో రైల్ స్టాఫ్ క్వార్టర్స్ లో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు సజీవ దహనం

الثلاثاء، 6 يناير 2026

Adarsh ​​Nagar crime Majlis Park in northwest Delhi Massive fire breaks out in Delhi Metro Rail staff quarters national Three burnt alive

t f B! P L


ఢిల్లీ వాయువ్య ప్రాంతంలోని ఆదర్శ్ నగర్, మజ్లిస్ పార్క్ వద్ద వున్న మెట్రో రైల్ లిమిటెడ్ స్టాఫ్ క్వార్టర్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. డీఎంఆర్సీకి చెందిన మేనేజర్ స్థాయి నుండి చాలామంది ఉద్యోగులు ఇక్కడ నివసిస్తోన్నారు. వేకువజామున 2:39 నిమిషాల సమయంలో మజ్లిస్ పార్క్ మెట్రోకు ఎదురుగా ఉన్న ఎఫ్ బ్లాక్ క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. వారిని అజయ్ విమల్ (42), ఆయన భార్య నీలమ్ (38), వారి కుమార్తె జాన్వి (10)గా గుర్తించారు. ఎఫ్ బ్లాక్ బిల్డింగ్ అయిదో అంతస్తులోని ప్లాట్‌లో వారు నివసిస్తోన్నారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో అన్ని గృహోపకరణాలు కాలిపోయాయి. అగ్నికీలలు ఇతర నివాసాలు, ఫ్లాట్లకు వ్యాపించకుండా ఉండటానికి ఆరు ఫైరింజిన్లతో అదుపు చేయాల్సి వచ్చిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెల్లవారు జామున 3:25 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పివేసిన అనంతరం ఫ్లాట్ నుండి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. ఈ క్రమంలో ఫైర్‌మెన్ రాకేష్ చేతికి గాయాలయ్యాయి. ఆయనను జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ