కొత్త సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను తీసుకొచ్చిన జియో హాట్‌స్టార్ !

Monday, January 19, 2026

and Premium plans Jio Hotstar introduces three new plans for new subscribers mobile monthly or annual payments quarterly Super technology

t f B! P L


జియో హాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రైబర్ల కోసం అప్డేట్ చేసిన సబ్‌స్క్రిప్షన్  ప్లాన్లను ప్రారంభించింది, దీనితో వారు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక చెల్లింపులు చేసుకోవచ్చు. మూడు కొత్త ప్లాన్ల కింద, సబ్‌స్క్రైబర్లు  మొబైల్, సూపర్, ప్రీమియం ప్లాన్ల కింద ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్రయోజనాలను పొందుతారు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త వినియోగదారులు కొత్త ప్లాన్ల కింద చెల్లించవలసి ఉంటుంది. కేవలం ₹79 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు కొత్త సబ్‌స్క్రైబర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి, అయితే ప్రస్తుత సబ్‌స్క్రైబర్ల ప్రయోజనాలు యథాతథంగా ఉంటాయి. ఈ ప్లాన్లు మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొబైల్, సూపర్, ప్రీమియం. మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ ఉంది. ఇతర పరికరాలను ఉపయోగించే వారి కోసం కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ ప్లాన్ ధర మూడు కాల వ్యవధులను బట్టి నిర్ణయిస్తారు. 

మొబైల్ ప్లాన్ ధర నెలకు ₹79, త్రైమాసికానికి ₹149, సంవత్సరానికి ₹499 ఉంటుంది. ఒక సమయంలో ఒకే మొబైల్ పరికరం దీన్ని ఉపయోగించగలదు. ఇందులో యాడ్స్ వస్తాయి. అంటే పరిమిత సంఖ్యలో ప్రకటనలు ప్రసారం చేస్తారు. హాలీవుడ్ కంటెంట్ మినహా ప్రతి కంటెంట్ యాక్సెస్ ఉంటుంది. అయితే, మీరు హాలీవుడ్ కంటెంట్, అంటే సినిమాలు, సిరీస్లు లేదా షోలు చూడాలనుకుంటే, హాలీవుడ్ యాడ్-ఆన్ ప్లాన్ను కూడా ఎంచుకోవచ్చు. ఈ హాలీవుడ్ యాడ్-ఆన్ ప్లాన్ నెలకు ₹49, త్రైమాసికానికి ₹129, సంవత్సరానికి ₹399 ఖర్చు అవుతుంది.

సూపర్ ప్లాన్ నెలకు ₹149, త్రైమాసికానికి ₹349, సంవత్సరానికి ₹1099 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్ ని రెండు డివైస్లలో ఒకేసారి ప్లే చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కూడా యాడ్స్ వస్తుంటాయి. అంటే తక్కువ ప్రకటనలు ప్రసారం చేస్తారు. అన్ని కంటెంట్ అందుబాటులో ఉంటుంది, దీనితో మొబైల్, వెబ్, లివింగ్ రూమ్ పరికరాల్లో జియో హాట్‌స్టార్ ని ఉపయోగించవచ్చు. హాలీవుడ్ యాడ్-ఆన్ ప్లాన్ కూడా చేర్చారు, అంటే మీరు హాలీవుడ్ సినిమాలు, సిరీస్లు లేదా షోల కోసం అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రీమియం ప్లాన్ నెలకు ₹299, త్రైమాసికానికి ₹699, సంవత్సరానికి ₹2199 ఖర్చు అవుతుంది. జియో హాట్‌స్టార్ ఒకేసారి నాలుగు డివైస్లలో అందుబాటులో ఉంటుంది, ఇది పూర్తిగా ఇందులో ఎలాంటి ప్రకటనలు రావు. అయితే, లైవ్ స్పోర్ట్స్, ఇతర లైవ్ షోల సమయంలో ప్రకటనలు వస్తాయి. అన్ని కంటెంట్ అందుబాటులో ఉంటుంది, దీనితో మీరు మొబైల్, వెబ్, లివింగ్ రూమ్ పరికరాల్లో జియో హాట్‌స్టార్ ని ఉపయోగించవచ్చు. హాలీవుడ్ యాడ్-ఆన్ ప్లాన్ కూడా చేర్చారు. అంటే మీరు హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లేదా షోల కోసం అదనపు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ