సూర్యలంక లో మూడు కొత్త హోటల్స్ కు ఆమోదం : ఫెర్రో అల్లాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీ

الخميس، 8 يناير 2026

Andhra Pradesh cabinet meeting Approval for three new hotels in Suryalanka CM Chandrababu Naidu spoke with the ministers Power subsidy for Ferro Alloys units for one year

t f B! P L


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపైన మంత్రులతో సంభాషించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు జలరవాణాను పెంపొందించుకోవటం ద్వారా లాజిస్టిక్స్ లో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని చంద్రబాబు అన్నారు. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొంటూ, అన్ని తీర ప్రాంత జిల్లాలలో ఒక్కో పోర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అంతేకాదు పర్యాటక రంగాన్ని గేమ్ చేంజర్ అని అభివర్ణించిన చంద్రబాబు చీరాలలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి సూర్యలంక లో మూడు కొత్త హోటల్స్ కు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీలను ప్రకటించారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విధించిన 4490 కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం ప్రజల పైన పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూనిట్ విద్యుత్ చార్జీని ఐదు రూపాయల 19 పైసల నుంచి నాలుగు రూపాయల 90 పైసలకు తగ్గించామని ఆయన వెల్లడించారు. బార్లు, లిక్కర్ షాపులకు ఏఈఆర్టీ చార్జీలను సమం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వృధాగా కలిసే జలాలను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని, నీరు వృధా కాకుండా చూసుకుంటే కొత్త పంటలకు వీలవుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తుందని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు కూడా ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాలను విశాఖపట్నం తీసుకు వెళ్లవచ్చని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇప్పుడు తమపై నిందలు వేయడం సరికాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ