ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వంటి ప్రతిష్ఠాత్మక ఆసుపత్రుల వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు సామాన్యులకు ఊరటనిచ్చే కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. వైద్యం వ్యాపారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటిలేటర్ అనేది ప్రాణాలను రక్షించే పరికరం కావాలి కానీ, ఆసుపత్రికి ఆదాయం తెచ్చే సాధనం కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా చికిత్స కాలాన్ని పొడిగించడం, ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులను చీకటిలో ఉంచడం వంటి ఫిర్యాదులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్సీరియస్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స వ్యయంపై పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త నిబంధనలను రూపొందించింది. జవాబుదారీతనం, నీతిని పెంచడమే లక్ష్యంగా ఇవి జారీ అయ్యాయి. రోగి పరిస్థితిని బట్టి వెంటిలేటర్‌పై ఉంచే ముందు కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేయాలి. పరిస్థితి నివేదికను చూపి, వ్రాతపూర్వక అనుమతి పొందిన తర్వాతే చికిత్స ప్రారంభించాలి. ఒకవేళ ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లేదా అనుమతి లేకుండా వెంటిలేటర్ వాడితే, ఆ ఖర్చును చెల్లించాల్సిన బాధ్యత రోగి కుటుంబంపై ఉండదు. శ్వాసకోశ వైఫల్యం, గుండెపోటు, తీవ్రమైన గాయాలు వంటి నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే వెంటిలేటర్ వాడాలి. కేవలం బిల్లు పెంచడానికి దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ చికిత్స సమయాన్ని పొడిగించాల్సి వస్తే, దానికి గల కారణాలను వివరిస్తూ కుటుంబం నుండి మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాలి. సాధ్యమయ్యే ఖర్చుపై ముందే స్పష్టత ఇవ్వాలి. 14 రోజుల కంటే ఎక్కువ కాలం వెంటిలేటర్ వాడాల్సి వస్తే, ఆసుపత్రిలో ప్రత్యేక ఆడిట్, సమీక్షా కమిటీల ద్వారా పర్యవేక్షణ ఉండాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
సామాన్యులకు ఊరటనిచ్చే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
الأحد، 4 يناير 2026
Based on the recommendations of an expert committee Central Health Ministry releases new guidelines to provide relief to common people national
ليست هناك تعليقات:
إرسال تعليق