పాకిస్థాన్ లో రెండు బాంబు పేలుల్లో ఆరుగురు పోలీసులు మృతి

الاثنين، 12 يناير 2026

international Six policemen killed in two bomb blasts in Pakistan Tank district of Khyber Pakhtunkhwa province three others seriously injured

t f B! P L


పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో జరిగిన  రెండు భారీ బాంబు పేలుళ్లలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొదటి బ్లాస్ట్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని టాంక్ జిల్లాలోని గోమల్ బజార్ లో ఓ పోలీస్ వాహనం వద్ద జరిగింది. ఈ బాంబ్ ను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పేల్చేసినట్లు సమాచారం. మరో బ్లాస్ట్ లక్కీ మార్వట్ జిల్లాలో జరిగింది. పోలీస్ వ్యాన్ టార్గెట్ గా ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు జరిగిన రెండు చోట్లా పోలీసు వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం. టెర్రరిస్టులు మా పోలీస్ వాహనం టార్గెట్ గా బాంబు పేలుళ్లు జరిపినట్లు స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను ఇంటీరియర్ మినిస్టర్ మోహసిన్ నక్వీ తీవ్రంగా ఖండించారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ టెర్రరిస్టుల ప్లాన్ లను ఛేదించాయని అన్నారు. పేషావర్, బన్ను, ఖైబర్ జిల్లాల్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు స్పష్టం చేశారు. ఎనిమిది మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు వివరించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ