దేశీయ మార్కెట్లో లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ వివరాలను లావా X పోస్ట్ లో షేర్ చేసింది. బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే డిజైన్ వెల్లడయింది. దీర్ఘచతురస్రాకార కెమెరా డిజైన్ ను కలిగి ఉంది. వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP AI కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇది వెనుక వైపు కూడా చిన్న డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేతో నోటిఫికేషన్‌లు, క్యాప్చర్ సెల్ఫీ, మ్యూజిక్ కంట్రోల్ సహా అనేక యాప్స్ ను సులభంగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ అనేక వివరాలు లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ లావా బ్లేజ్ డుయో 3 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 1.6 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ సహా మరిన్ని స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.2, GPS, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు, మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్ లు ఉంటాయని సమాచారం. లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.
ホーム
/
technology
/
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల
الجمعة، 16 يناير 2026
8MP selfie camera camera design with two cameras Lava Blaze Duo 3 Smartphone to be Released Soon science smart phone technology
ليست هناك تعليقات:
إرسال تعليق