సామూహిక వలసలు అమెరికన్ కార్మికుల నుండి అవకాశాలను దూరం చేస్తున్నాయని, సామూహిక వలసలు అమెరికా కలల దొంగతనం లాంటిదేనంటూ పేర్కొంటూ ఎక్స్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ పోస్ట్ చేశారు. దీనిపై స్వదేశంలో విమర్శలు మండిపడుతున్నారు. విదేశీయులపై అంత ద్వేషం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వాన్స్ భార్య ఉష భారతీయ వలసదారుల కుమార్తె అని, ఆమెను తిరిగి స్వదేశానికి పంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రచయిత, రాజకీయ వ్యాఖ్యాత వజాహత్ అలీ తీవ్రంగా స్పందించారు. మీరు ఉషను, ఆమె భారతీయ కుటుంబాన్ని, మీ ద్విజాతి పిల్లలను భారత దేశానికి తిరిగి పంపాలని ఆయనకు సూచించారు. తాజాగా న్యూయార్క్ పోస్ట్ పాడ్‌కాస్ట్‌లో కనిపించిన వాన్స్ అమెరికన్లు తమ జాతి, భాష లేదా చర్మ రంగును పంచుకునే పొరుగువారిని ఇష్టపడటం పూర్తిగా సహేతుకమైనది, ఆమోదయోగ్యమైనదని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనా విమర్శలు వస్తున్నాయి.
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారతీయ అమెరికన్ల ఆగ్రహం : ఉషను భారత్ పంపేయండి
الاثنين، 8 ديسمبر 2025
Indian Americans outraged over JD Vance's comments international Send Usha to India stating that mass immigration is taking away opportunities from American workers
ليست هناك تعليقات:
إرسال تعليق