హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్ ని విజయసాయిరెడ్డి వియ్యంకుడి కుమారుడు, లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన శరత్ చంద్రారెడ్డికి చెందిన ఔరో రియాల్టీ ఈ హోటల్ ను రూ. 315 కోట్లకు కొనుగోలు చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా లీజు ప్రాతిపదికన తాజ్-జీవీకే హోటల్స్ ఆధ్వర్యంలో నడిచింది. 2023లో లీజు గడువు ముగియడంతో, భూ యజమాని ఈ విలువైన స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించారు. ఈ కొనుగోలు లావాదేవీ అక్టోబర్ 31, 2025 న జరిగింది, దీనికి గాను సంస్థ రూ. 17.3 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఔరో రియాలిటీ అసలు పేరు అరబిందో రియాలిటీ. లిక్కర్ స్కామ్ లో శరత్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత కంపెనీకి చెడ్డపేరు వస్తోందని ఆయనను ఫార్మా కంపెనీ బాధ్యతల నుంచి తప్పించారు. కానీ ఆ ఫార్మాతో సంబందం లేకుండా ఆయన విడిగా అరబిందో రియాలిటీ కంపెనీ పెట్టుకున్నారు. రెండు పేర్లూ ఒకేలా ఉండటం ఏమిటని వాటాదార్లు అభ్యంతర పెట్టడంతో ఔరో రియాలిటీగా మార్చారు.
0 Comments