తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట్ పీఎస్‌ : దేశంలో ఏడో స్థానం

الاثنين، 1 ديسمبر 2025

aspects like cleanliness of the station surroundings best CCTNS work gardening national Seventh position in the country Shamirpet PS as the best police station in Telangana state Union Home Ministry

t f B! P L


కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను ఎమ్‌హెచ్‌ఏ పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్‌ఎస్‌ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పది ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ