టీటీడీ పరకామణి కేసు : కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడిన హైకోర్టు !


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు టీటీడీ పరకామణి చోరీ కేసులో సీఐడీకి కీలక సూచనలు చేసింది. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ విచారణ నివేదిక అందినట్టు పేర్కొన్న హైకోర్టు, ఈ కేసులో సీఐడీ ఇంకా కొన్ని అంశాలపై విచారణ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. కేసులో వేర్వేరు అంశాలు ఉన్న కారణంగా విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం ఆ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెల ఐదో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కీలక విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై సీఐడీ ఇప్పటికే దర్యాప్తు నివేదికను సమర్పించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. కోర్టు సీఐడీ నివేదికను పరిశీలించిన అనంతరం, కేసులో ఇంకా కొన్ని కీలక అంశాలపై విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ఈ కేసులో వేర్వేరు కోణాలు, విభిన్న ఆరోపణలు ఉన్నందున, వాటిని విడివిడిగా పరిశీలించి.. అవసరమైతే ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసులోని భిన్న అంశాలపై విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాన్ని పరిశీలించాలి అని సీఐడీ కి సూచించింది.. ప్రస్తుత దర్యాప్తు సరైన దిశలో ఉన్నా.. ఇంకా పూర్తిస్థాయి విచారణ అవసరం అని పేర్కొంది.. ఆస్తుల లావాదేవీలతో పాటు ఇతర సంబంధిత అంశాలను లోతుగా పరిశీలించాలి ఆదేశించింది.. ఈ ట్విస్ట్‌లతో టీటీడీ పరకామణి కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు నివేదికలు, ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియలు తదుపరి విచారణలో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments