రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత దేశానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మోడీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన విందు అనంతరం రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. ముఖ్యంగా భగవద్గీతను రష్యా భాషలోకి అనువదించి ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై పుతిన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా ప్రధాని మోడీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి ఇచ్చేటప్పుడు తీసిన ఫొటోను కూడా షేర్ చేయగా నెటిజెన్లు కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. చర్చలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ మాస్కో, న్యూఢిల్లీ మధ్య సహకారం ఏ పశ్చిమ దేశ వ్యతిరేక కూటమిలో భాగం కాదని ఆయన స్పష్టం చేశారు. "తమకు ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ.. మేం, ప్రధాని మోడీ ఎప్పుడూ ఎవరికో వ్యతిరేకంగా పని చేయడానికి సహకారాన్ని పెంచుకోలేదు" అని పుతిన్ అన్నారు. ఈ భాగస్వామ్యం వైరుధ్యాలపై కాకుండా పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జీ7 ("బిగ్ సెవెన్") కూటమిని పుతిన్ విమర్శిస్తూ.. కొనుగోలు శక్తి సమానత్వం పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండగా, యూకే 10వ స్థానంలో ఉందని గుర్తు చేశారు.
0 Comments