బ్రెజిల్‌లోని అరుడా కామరా జూలో సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఓ యువకుడు సింహాన్ని దగ్గరగా చూడటానికి ప్రయత్నించాడు. ఆ యువకుడు చెట్టు ఎక్కి నేరుగా సింహం ఉన్న బ్యారక్‌లోకి దూకాడు. ఇది చూసిన వెంటనే సింహం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లాక్కొని పొద దగ్గరకు వెళ్లి చంపి తినేసింది. పర్యాటకులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో వీడియో తీశారు. భద్రతా నియమాలను ఉల్లంఘించడం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చు. అడవి జంతువుల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించకూడదని జూ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు.
0 Comments