వాట్సాప్ లో 'మిస్డ్ కాల్ మెసేజ్' !

السبت، 13 ديسمبر 2025

'Missed Call Message' on WhatsApp science technology This is a modern alternative to the old voice message

t f B! P L


వాట్సాప్ తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్' అనే ఫీచర్ ను  తీసుకొచ్చింది. ఇది పాతకాలపు వాయిస్ మెసేజ్ కు ఆధునిక ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఇకపై మీరు ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేసినప్పుడు వారు అందుబాటులో లేకపోతే వెంటనే ఒకే ట్యాప్ తో  వారికి వాయిస్ నోట్ లేదా వీడియో నోట్ ను మెసేజ్ గా పంపవచ్చు. ఈ నోట్ నేరుగా మీ చాట్ లో రికార్డ్ అవుతుంది. దీనివల్ల కాల్ మిస్ అయినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తక్షణమే తెలియజేయడానికి ఈజీ అవుతుంది. అలాగే గ్రూపులలో జరిగే వాయిస్ చాట్ లలో ఇకపై సభ్యులు తమ మాటలకు అడ్డు కలగకుండా ఉండేందుకు 'రియాక్షన్స్' పంపే అవకాశం కల్పించారు. దీనితో పాటు గ్రూప్ వీడియో కాల్స్ లో మాట్లాడుతున్న వ్యక్తిని ఆటోమేటిక్ గా హైలైట్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మరింత తేలిక అవుతుంది. వాట్సాప్ ఇప్పుడు తన మెటా ఏఐ ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచింది. ఇందులో భాగంగా మిడ్జర్నీ, ఫ్లక్స్ వంటి అత్యాధునిక మోడల్స్ టెక్నాలజీని వాడుకోవడం వల్ల టెక్స్ట్ ఆధారంగా తయారయ్యే ఏఐ చిత్రాల నాణ్యత, స్పష్టత చాలా మెరుగయ్యాయి. ముఖ్యంగా పండుగల సందర్భంగా శుభాకాంక్షలు పంపేందుకు లేదా సరదా గ్రాఫిక్స్ రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ అప్డేట్ లో మరో ఆకర్షణీయమైన ఫీచర్ ఏమిటంటే మీరు పంపిన లేదా స్టేటస్ లో పెట్టిన సాధారణ ఫోటోలను కూడా చిన్న వీడియో క్లిప్గా యానిమేట్ చేసే సామర్థ్యం ఉంది. మీరు కేవలం ప్రాంప్ట్ ఇస్తే, ఏఐ దాన్ని కదిలే చిత్రంగా మార్చుతుంది. ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టేటస్ అప్డేట్లలో కూడా కొత్త మార్పులు వచ్చాయి. యూజర్లు తమ స్టేటస్ లో ఇప్పుడు మ్యూజిక్ లిరిక్స్, ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, ఇతరులు స్పందించడానికి వీలుగా ప్రశ్నలు అడిగే ఫీచర్లను జోడించుకోవచ్చు. ఛానెల్స్ లో  అడ్మిన్లు తమ ఫాలోవర్లతో మరింత సమర్థవంతంగా మాట్లాడేందుకు, ప్రశ్నలు అడగడం ద్వారా రియల్ టైంలో స్పందనలు పొందేందుకు వీలు కలిగించారు. ఇక డెస్క్ టాప్ యూజర్ల కోసం, అన్ని డాక్యుమెంట్లు, లింకులు, మీడియా ఫైళ్లను ఒకే చోట సులభంగా వెతికేందుకు నిర్వహించేందుకు కొత్త మీడియా ట్యాబ్ లు  తీసుకొచ్చారు. అలాగే చాట్లలో షేర్ చేసే పెద్ద పెద్ద లింకుల ప్రివ్యూలను మరింత స్పష్టంగా, చిందరవందరగా లేకుండా కనిపించేలా మెరుగుపరచడం జరిగింది. ఈ అన్ని ఫీచర్లను హాలిడే సీజన్ సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్ తెలిపింది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ