ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిరీక్షిస్తున్నారు. మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళకు బయలుదేరాల్సిన విమానాల్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ విమానాలను రద్దు చేసింది. దీంతో గమ్యస్థానాలు చేరుకోవాల్సిన దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు గత రాత్రి నుంచి ఎయిర్ పోర్ట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు శబరిమల వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న దాదాపు 200 మందికిపైగా స్వాములు సైతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఇక ఈ విమానాల రాకపోకలపై ఇండిగో సిబ్బంది ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ సంస్థ సిబ్బంది తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికుల్లో చిన్నారులు సైతం ఉన్నారని, వారిని సైతం ఎవరూ పట్టించుకోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య : ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు
الأربعاء، 3 ديسمبر 2025
200 devotees who had booked flight tickets to go to Sabarimala Passengers stranded at the Shamshabad airport Technical problem in IndiGo flights telangana
ليست هناك تعليقات:
إرسال تعليق