స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. ఆమె తన షిఫ్ట్ సమయం కంటే సుమారు 40 నిమిషాల ముందే ఆఫీసుకి చేరుకోవడం అలవాటు చేసుకుంది. ఆమె షిఫ్ట్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆమె మాత్రం ప్రతిరోజూ 6:45 నుండి 7:00 గంటల మధ్యలోనే ఆఫీసులో ప్రత్యక్షమయ్యేది. దాదాపు రెండేళ్లపాటు ఆమె ఇలాగే చేసింది. ఆమె త్వరగా రావడం పట్ల కంపెనీ ప్రతినిధులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందే వస్తే ఆఫీసులో చేయడానికి పనేమీ ఉండదు.. కాబట్టి షిఫ్ట్ సమయానికే రమ్మని ఆమెకు మౌఖికంగా, లిఖితపూర్వకంగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యువతి మాత్రం తన మొండివైఖరిని వీడలేదు. కొన్నిసార్లు ఆమె ఆఫీస్ క్యాంపస్‌లోకి రాకముందే, కంపెనీ యాప్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించేది. ఇది ఆమె నిబద్ధతను కాకుండా కంపెనీ నిబంధనలను ధిక్కరించే ధోరణిని చూపుతోందని యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో ఆమె ప్రవర్తనను తీవ్రమైనదిగా అలాగే నమ్మకద్రోహం గా పరిగణించిన బాస్.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించి తనను అన్యాయంగా తొలగించారంటూ దావా కూడా వేసింది. కోర్ట్ కూడా కంపెనీ ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సరైనదిగా గుర్తించింది. ఆమె తీరు వల్ల టీమ్ కోఆర్డినేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయని తోటి ఉద్యోగులు సాక్ష్యం కూడా చెప్పారు. ఈ కేసులో కంపెనీ ఆదేశాలను పాటించకపోవటం క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆమెను తొలగించడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇండియాలో మాత్రం ఆఫీసుకు ముందొస్తే ఉద్యోగి విషయంలో యాజమాన్యాలు భవిశా ఇలా అస్సలు చేయవేమో.
టైం కంటే ముందే ఆఫీసుకు వస్తున్న ఉద్యోగిని తొలగింపు : కంపెనీ నిబంధనలను ధిక్కరించే ధోరణిని చూపుతోందని యాజమాన్యం
الخميس، 11 ديسمبر 2025
court also upheld the management's decision Employee fired for arriving at the office before time Management says she was showing a tendency to defy company rules
ليست هناك تعليقات:
إرسال تعليق