తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆయన వద్దకు వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చిరునవ్వుతో పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ సమయంలో రేవంత్ వెంట పలువురు మంత్రులు ఉన్నారు. రేవంత్ వస్తోండటాన్ని చూసిన కేసీఆర్, ఆయన వెనుకే ఉన్న బీఆర్ఎస్ సభ్యులు మర్యాదపూరకంగా లేచి నిల్చున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలునని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ గౌరవం ఉంటుందని అన్నారు. నిండు సభలో కేసీఆర్ ను కలిసి, గౌరవం ఇచ్చేంత సంస్కారం రేవంత్ రెడ్డికి ఉంటే చాలునని ఆయన పేర్కొన్నారు. ఇదే సంస్కారం బయట మాట్లాడే మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ సభలోకి రాగానే నమస్కరిస్తూ చిరునవ్వుతో పలకరించిన రేవంత్ రెడ్డి
الاثنين، 29 ديسمبر 2025
He also inquired about his health KCR entered the assembly Revanth Reddy greeted him with a smile and a namaste telangana
ليست هناك تعليقات:
إرسال تعليق