పాకిస్తాన్--ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన 48 గంటల వ్యవధిలోనే మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తమ దేశాలనికి చెందిన ఐదుగురు పౌరులు మృతి చెందిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. ఇరు దేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగియాని, పాకిస్తాన్ తమ సరిహద్దులు వెంబడి కాల్పులకు ఉపక్రమించిందని ఆఫ్ఘాన్ అధికారులు స్పష్టం చేశారు. వారి దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టామని, ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు మృత్యువాత పడటం బాధాకరమని ఆఫ్ఘనిస్తాన్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఇరుదేశాల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయ్యింది. ఈ ఏడాది అక్టోబర్‌లో, ఆపై నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగ్గా, తాజాగా వీరి మధ్య మరొకసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ సరిహద్దుల వెంబడి ఇరు దేశాలు కాల్పులు జరుపుకోవడం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
పాకిస్తాన్--ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు !
السبت، 6 ديسمبر 2025
citizens were killed in the incident international Pakistan-Afghanistan border clashes resume within 48 hours of peace deal
ليست هناك تعليقات:
إرسال تعليق