తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. అయ్యర్పాడి తేయాకు ఎస్టేట్‌లో పనిచేస్తున్న అస్సాం వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ (5) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని పొదల నుంచి ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చిరుతపులి బాలుడిని పట్టుకుని లాక్కెళ్లిపోయింది. తోట లోని కార్మికులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన కాసేపటి తర్వాత తోట లోపలి భాగంలో సైఫుల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఇదే ప్రాంతంలోని కావరకల్లు వద్ద నూర్జిల్ హక్ (8) అనే బాలుడు, జూన్ 22న పచ్చమలై వద్ద రోషిణి (4) అనే బాలిక చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
తేయాకు తోటలో చిరుతపులి దాడిలో బాలుడు మృతి
الأحد، 7 ديسمبر 2025
Coimbatore district Five-year-old boy killed in leopard attack in tea garden playing in front of his house on Saturday Tamil Nadu tea garden in Valparai
ليست هناك تعليقات:
إرسال تعليق