యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడం ఇరు జట్లకూ సవాలుగా మారింది.స్వింగ్, సీమ్, బౌన్స్ కారణంగా బ్యాటర్లకు క్రీజులో నిలబడటం కష్టమైంది. చివరకు ఈ టెస్ట్ రెండు రోజేల్లోనే ముగిసిపోయింది. తొలి రోజే 20 వికెట్లు పడిపోయాయి. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడి ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఈ పిచ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పిచ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ పిచ్‌ను అధికారికంగా 'అన్‌సాటిస్ ఫ్యాక్టరీ'గా పేర్కొంది. అంతేకాకుండా ఐసీసీ పిచ్ అండ్ అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్‌లో భాగంగా మెల్‌బోర్న్ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఇలా చేయడానికి గల కారణాన్ని ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యుడు జెఫ్ క్రోవ్ వివరించారు. 'మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) పిచ్ బౌలర్లకు విపరీతంగా అనుకూలంగా ఉంది. మొదటి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడటం, ఏ బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ సాధించకపోయారు. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం పిచ్ 'సంతృప్తికరంగా లేదు'. అందుకే ఈ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చాం' జెఫ్ క్రోవ్ అని పేర్కొన్నారు. అయితే వరుసగా ఇలా 6 డీమెరిట్ పాయింట్లు వస్తే ఆ వేదికపై 12 నెలల పాటు నిషేధం విధిస్తారు.
ఆస్ట్రేలియా పిచ్‌లపై ఐసీసీ ఆగ్రహం : మెల్‌బోర్న్ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్
الثلاثاء، 30 ديسمبر 2025
20 wickets fell on the first day alone. 36 wickets fell in two days cricket ICC expresses anger over Australian pitches Melbourne pitch receives one demerit point sports
ليست هناك تعليقات:
إرسال تعليق