ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే ఆరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు పేర్కొన్నారు.
ホーム
/
which stated that only areas at least 100 meters above sea level should be considered part of the Aravalli mountains
/
ఆరావళి పర్వత శ్రేణులు : గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు
الاثنين، 29 ديسمبر 2025
Aravalli Mountain Range national Supreme Court stays its previous order which stated that only areas at least 100 meters above sea level should be considered part of the Aravalli mountains
ليست هناك تعليقات:
إرسال تعليق