ఈరోజు మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, బ్యాంకులకు సుమారు ₹1.5 లక్షల కోట్ల లిక్విడిటీ మద్దతు, తటస్థ వైఖరి వంటి కారణాల వల్ల అందరూ ఈ రోజు స్టాక్ మార్కెట్ లాభాల వైపు పరుగులు పెడుతుందని భావించారు, కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. మార్కెట్ మొదలైన కొన్ని గంటల్లోనే పెట్టుబడిదారులు సుమారు ₹8 లక్షల కోట్లు కోల్పోయారు. ఇండిగో షేర్ల పతనం మార్కెట్ సెంటిమెంట్‌ను గణనీయంగా దెబ్బతీసిందని నిపుణులు వెల్లడించారు. ఇదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం సమావేశం కానుంది, అలాగే పలు కారణాల వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్త పడ్డారు. దీంతో పాటు రూపాయి క్షీణత, ముడి చమురు ధరలు పెరగడం కూడా స్టాక్ మార్కెట్ క్షీణతకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈరోజు సెన్సెక్స్ 85,624.84 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం సెన్సెక్స్ 85,712.37 వద్ద ముగిసింది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు సెన్సెక్స్ దాదాపు 745 పాయింట్లు తగ్గి 84,969.11 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ కూడా గణనీయమైన క్షీణతతో ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ దాదాపు 280 పాయింట్లు తగ్గి 25,922.10కి చేరుకుంది. ఈ రోజు నిఫ్టీ 26,159.80 వద్ద ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు నిఫ్టీ 253.60 పాయింట్లు తగ్గి 25,932.60 వద్ద ట్రేడవుతోంది.
విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్ : రూ.8 లక్షల కోట్లు హాం ఫట్ !
الاثنين، 8 ديسمبر 2025
business Contrary to analysts' expectations Experts revealed that the fall in IndiGo shares national Rs. 8 lakh crore lost the stock market collapsed
ليست هناك تعليقات:
إرسال تعليق