డిసెంబర్ 5 నుంచి 15 మధ్య రద్దు చేసిన అన్ని విమాన టికెట్లకు డబ్బులు రిఫండ్ !

الجمعة، 5 ديسمبر 2025

IndiGo Airlines national providing food and snacks at airports as well as thousands of hotel rooms Refunds for all flight tickets cancelled between December 5 and 15

t f B! P L


ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సమస్యల కారణంగా ఇవాళ కూడా దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. ఓ దశలో ఢిల్లీ మినహా దేశంలో నడిచే ఇతర అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. అదే సమయంలో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో లగేజీ గందరగోళంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తమ టికెట్ల రిఫండ్స్, వసతి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 మధ్య రద్దు చేసిన అన్ని విమానాలకు పూర్తి టికెట్ మొత్తాల్ని తిరిగి ఇస్తామని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు ఎలా టికెట్ బుక్ చేసుకున్నారో అదే అకౌంట్లకు డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపింది. అలాగే ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, విమానాశ్రయాలలో ఆహారం, స్నాక్స్‌తో పాటు వేలాది హోటల్ గదులు, ట్రావెల్ ఆప్షన్స్ ను ఇస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. అలాగే సీనియర్ సిటిజన్లకు సాధ్యమైన చోట లాంజ్ ఇస్తామని తెలిపింది. అలాగే దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలలో తీవ్ర గందరగోళానికి దారితీసిన విమానాల రద్దుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఇండిగో తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. మరోవైపు తమ విమానాల కార్యకలాపాలను స్థిరీకరించడానికి కొత్త నిబంధనల నుంచి సడలింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం ఇండిగో ఎయిర్‌లైన్ ఓటీపీ మంగళవారం 35 శాతం నుండి బుధవారం 19.7 శాతానికి పడిపోయింది. గురువారం అయితే 8.5 శాతానికి పడిపోయింది. చాలా కాలంగా సమయపాలనను కచ్చితంగా పాటిస్తున్న ఇండిగోకు తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఇన్ని పరిణామాల మధ్య కూడా డిసెంబర్ 8 వరకు ఇలా విమానాల రద్దు సమస్యలు ఉంటాయని, ఆ తర్వాత కూడా సర్వీసులు తగ్గిస్తామని డీజీసీఏకు తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ