డుంకి ట్రావెల్‌ ఏజెంట్‌ ఇంట్లో ఈడీ సోదాలు : వెలుగు చూసిన రూ.4.62 కోట్ల నగదు, 313 కిలోల వెండి, 6 కిలోల బంగారం

السبت، 20 ديسمبر 2025

313 kg of silver and 6 kg of gold unearthed and Haryana dozen locations in Delhi ED raids on the house of a 'Donkey' travel agent: Rs. 4.62 crore in cash national punjab

t f B! P L


భారతీయులను అమెరికాకు దొంగచాటుగా తరలించే డుంకి ట్రావెల్‌ ఏజెంట్‌ ఇంట్లో జరిపిన తనిఖీల్లో కళ్లు చెదిరే రీతిలో సొత్తు వెలుగు చూసింది. భారతీయుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)బృందాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానల్లోని డజనుకుపైగా ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. ఈ సందర్భంగా రూ.4.62 కోట్ల నోట్ల కట్టలతోపాటు, రూ.19.13 కోట్ల విలువైన 313 కిలోల వెండి, 6 కిలోల బంగారం కనిపించాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ ఏజెంట్‌ నివాసాల్లో దొరికిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో అభ్యంతరకరమైన చాటింగ్‌లు కనిపించాయని అధికారులు శుక్రవారం తెలిపారు. హర్యానలోని పానిపట్‌లో జరిపిన తనిఖీల్లో డుంకి కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు దొరికాయన్నారు. అమెరికాకి అక్రమమార్గంలో వెళ్లాలనుకునే వారి నుంచి ఇతడు ఆస్తి పత్రాలను తన కమిషన్‌లో భాగంగా ష్యూరిటీగా ఉంచుకునేవాడని అధికారులు వివరించారు. అమెరికాలోకి దొంగచాటుగా ప్రవేశించాలనుకునే వలసదారులు గాడిద మాదిరిగా సుదీర్ఘ, కష్టమైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పేందుకే డాంకీ/డుంకీ అనే పదం వాడుతుంటారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ