2032 నాటికి తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం 'మైత్రి-2' సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది. 1981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్‌లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న 'దక్షిణ గంగోత్రి' మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది. గత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం కోసం అధునాతన 'ఐస్-కోర్ స్టోరేజ్' వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది. ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది. ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు. గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.
ホーム
/
technology
/
2032 నాటికి సిద్ధం కానున్న భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం
الخميس، 18 ديسمبر 2025
but the government stated that it has been delayed due to certain reasons India's Maitri-2 Research Station to be Ready by 2032 project was scheduled for completion by 2029 science technology
ليست هناك تعليقات:
إرسال تعليق