ప్రభుత్వ కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయింపు !

الخميس، 13 نوفمبر 2025

Allotment of shops to barber Brahmins in government complexes Andhra Pradesh complexes under the auspices of panchayats corporations municipalities

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉన్న కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మెమోలను కూడా బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. 1996లోని జీవో 13 ను అనుసరించాలని కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు ఉత్తర్వుల్లో సూచించింది. కొద్ది నెలల కిందట నాయీ బ్రాహ్మణుల జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నెలవారీ భృతిని రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వర్తించేలా ఈ జీవో జారీ చేసింది. నెలవారీ భృతిని 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ