బీజీ2 పాడ్‌కాస్ట్‌లో ఇన్వెస్టర్ బ్రాడ్ గెర్ట్‌నర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ పునర్యవస్థీకరణలో భాగంగా మైక్రోసాఫ్ట్ లో సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించామని, 2025 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,28,000లకు కుదించినట్లు వివరించారు. 2022లో కంపెనీ నియామకాలను 22 శాతం పెంచామని, ఏఐ ఇన్ ఫ్రా, పార్ట్ నర్ షిప్ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ టూల్స్ లో మరింత పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త టెక్కీలకు అవకాశం ఇవ్వదలిచామని సత్య నాదెళ్ల చెప్పారు. గతంలో కంటే మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని, ఏఐ అనుభవం, గట్టిపట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. ఉద్యోగులు తమ పనిలో దాదాపు ప్రతి విషయంలోనూ AIని ఉపయోగించుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ లో ఎటువంటి ప్లానింగ్ గానీ, దాని ఇంప్లిమెంటేషన్ గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోనే ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు. ప్రతిదీ ఏఐ నుంచే నుంచే మొదలవుతుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ 365 కొపైలట్, గిట్‌హబ్ కొపైలట్ వంటి ఉత్పత్తులలోని ఏఐ సామర్థ్యాలను ప్రతి ఉద్యోగి ఉపయోగించుకోవాలని కంపెనీ కోరుకుంటోంది. ఈ ఉత్పత్తులు ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థల మోడల్స్‌ను అనుసంధానిస్తాయి. క్లౌడ్ డేటా కేంద్రాలకు డిమాండ్ పెరిగినప్పుడు, ఓ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ మెయింటెనెన్స్ పనులను నిర్వహించడానికి ఏఐ ఏజెంట్‌లను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సత్య నాదెళ్ల అన్నారు.
ホーム
/
technology
/
ఏఐ బేస్డ్ నియామకాల ప్రక్రియ త్వరలో మొదలవుతుంది : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
الأحد، 2 نوفمبر 2025
AI-based hiring process to start soon In an interview with investor Brad Gertner on the BG2 podcast Microsoft CEO Satya Nadella science technology
ليست هناك تعليقات:
إرسال تعليق