హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ : తమిళనాడు ప్రభుత్వానికి తుది అలైన్ మెంట్ ను సమర్పించిన దక్షిణ మధ్య రైల్వే

الاثنين، 24 نوفمبر 2025

Hyderabad - Chennai High Speed ​​Rail Corridor South Central Railway submits final alignment to Tamil Nadu government telangana

t f B! P L


హైదరాబాద్ - చెన్నై నగరాల మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్ కీలక దశలోకి అడుగు పెట్టింది. 778 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు కారిడార్ తుది అలైన్ మెంట్ ను తమిళనాడు ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే సమర్పించింది. ఈ పరిణామం హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేయడం కోసం కీలకమైన ముందడుగుగా చెబుతున్నారు. హైదరాబాద్ - చెన్నై బుల్లెట్ ట్రైన్ మొదట గుడివాడ మీదుగా ప్రణాళిక చేయబడింది. అయితే తాజా అలైన్ మెంట్ లో తిరుపతిని చేర్చడం వల్ల ఈ రైలు కారిడార్ ప్రయాణికులకు విస్తృతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది హైదరాబాద్- చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుంది . ప్రస్తుతం హైదరాబాద్ - చెన్నై మధ్య రైలు ప్రయాణం 12 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త హై స్పీడ్ రైలుతో రెండు గంటల 20 నిమిషాల సమయంలో చెన్నై చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు రెండు నగరాల మధ్య ఆర్థిక సంబంధాలను, వ్యాపార అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా మెరుగైన అవకాశాలను ఇస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ