వీరి కలయిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంది : ట్రంప్, న్యూయార్క్ మేయర్ భేటీపై శశిథరూర్ పోస్ట్

السبت، 22 نوفمبر 2025

national New York Mayor's meeting Shashi Tharoor shared a video of this on social media 'X' Shashi Tharoor's post on Trump Their meeting reflects the spirit of democracy

t f B! P L


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొత్తగా ఎన్నికైన న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్‌దానీ వైట్‌హౌస్‌లో శుక్రవారంనాడు కలుసుకున్నారు. స్నేహపూర్వకంగా సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శశిథరూర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. వీరి కలయిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉందన్నారు. ఎన్నికల సమయంలో విమర్శలు చేసుకున్నప్పటికీ ఎన్నికల ముగిసిన తర్వాత సామరస్యపూర్వకంగా కలుసుకోవడం అభినందనీయమన్నారు. 'ప్రజాస్వామ్యం అంటే ఇలా పనిచేయాలి. ఎన్నికల్లో సిద్ధాంతాల కోసం పోరాడాలి. ఇందుకోసం ఎంతవరకైనా వెళ్లాలి. అయితే ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం దేశ ప్రయోజనాల కోసం నేతలు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇండియాలో కూడా ఇలాంటి స్ఫూర్తిని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా నా వంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నాను' అని శశిథరూర్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కాగా, థరూర్ వ్యాఖ్యలను బీజేపీ ప్రశంసించింది. కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబం కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలనే అభిప్రాయం పరోక్షంగా శశిథూరర్ వెల్లడించినట్టు బీజేపీ అధికార ప్రతినిధ షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు. రెండ్రోజుల క్రితం కూడా రామ్‌నాథ్ గోయెంకా స్మారకోపన్యాసంలో మోడీ చేసిన ప్రసంగాన్ని శశిథరూర్ ప్రశంసించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటికే గుర్రుమంటోంది. అంత ఇయిష్టంగా పార్టీలో కొనసాగడం ఎందుకంటూ పలువురు నేతలు ఆయనను నిలదీస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ