దేశీయ మార్కెట్లో 2000వ సంవత్సరంలో మహీంద్రా బొలెరో కారు లాంచ్ అయ్యింది. పాతికేళ్లు గడిచినా వినియోగదారుల ఆదరణ అలాగే వుంది. ఈ కారు ఏసీ, సౌకర్యాలు కంటే బిల్డ్ క్వాలిటీ, తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్, ఎంతమందికైనా చోటు ఇవ్వడం, రోడ్లు ఎలా ఉన్నా భయపడకుండా వెళ్లడం వంటి విషయాలకే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. మహీంద్రా కంపెనీ తెలిపిన లెక్కల ప్రకారం 2025 అక్టోబర్‌లో 14,343 యూనిట్లు అమ్ముడుపోగా, గతేడాది అంటే 2024 అక్టోబర్ నెలలో కేవలం 9,849 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే, అక్టోబర్ నెలలో 4,494 కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. లెక్కల్లో చెప్పాలంటే ఇది ఏకంగా 46 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. బొలెరో పాత మోడల్ అయినా, అమ్మకాల్లో కొత్త కార్లకి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బొలెరో కారు మూడు ముఖ్యమైన వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో కొన్ని 7 సీటర్లు కాగా, కొన్ని ఏకంగా 9 సీటర్లుగా దొరుకుతున్నాయి. 7 సీటర్ ఆప్షన్‌లో సాధారణ బొలెరో దొరుకుతుంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. ఇక దీని టాప్ వెర్షన్ ధర రూ.9.69 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఈ మోడల్ చాలా మంచి ఆప్షన్. బొలెరో నియో కారు కూడా 7 సీటర్ ఆప్షన్‌లోనే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలతో మొదలై, టాప్ వెర్షన్ ధర రూ.10.49 లక్షల వరకు ఉంటుంది. పాత బొలెరో కంటే ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లు అదనంగా ఉంటాయి. కుటుంబం పెద్దగా ఉండి, ఎక్కువ మంది ప్రయాణించాలనుకునేవారికి బొలెరో నియో ప్లస్ బెస్ట్. ఈ మోడల్ ఏకంగా 9 సీటర్ ఆప్షన్‌లో దొరుకుతుంది. దీని ప్రారంభ ధర రూ.10.77లక్షలు కాగా, అత్యంత ఖరీదైన టాప్ వెర్షన్ ధర రూ.12.90 లక్షల వరకు ఉంది. బొలెరో నియో ప్లస్ లో 9 మంది కూర్చునే ఆప్షన్ ఉండడం ఈ కారుకున్న పెద్ద ప్లస్ పాయింట్. అలాగే, 5 సీటర్ల ఆంబులెన్స్ వెర్షన్ కూడా ఈ నియో ప్లస్ మోడల్‌లో దొరుకుతుంది.
ホーム
/
technology
/
మహీంద్రా బొలెరో కారుకు పాతికేళ్లయినా చెక్కుచెదరని వినియోగదారుల ఆదరణ
السبت، 15 نوفمبر 2025
automobile build quality Car has become more famous for its AC low-cost maintenance Mahindra Bolero car has unwavering customer support even after decades space for many people technology
ليست هناك تعليقات:
إرسال تعليق