ఐఫోన్ చాసిస్‌ కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్పం నుంచే సరఫరా !

السبت، 8 نوفمبر 2025

andhrapradesh High-grade aluminum required for iPhone chassis will now be supplied from the heap Panchumarthy Anuradha TDP

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, ఆ సంకల్పంలో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత 16 నెలల నుంచి దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌ తోపాటు పలు దేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించారని చెప్పారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అమెరికా దిగ్గజం యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్‌ కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్పం నుంచే సరఫరా అవుతుందని తెలియజేశారు. హిందాల్కో రూ.586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని దీని ద్వారా 613 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వేలాది అనుబంధ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌ లోకి లాగే గేట్‌ వే గా కుప్పం మారిందని ఆమె అన్నారు. చంద్రబాబు, లోకేష్ కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తుంటే సిగ్గులేకుండా జగన్ రెడ్డి దొంగ మెయిల్స్ పంపి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. జగన్‌ కు తన సొంత పరిశ్రమలైన నకిలీ మద్యం పరిశ్రమ, అక్రమ మైనింగ్ దందా, గంజాయి వ్యాపారం, మహిళలను కిడ్నాప్ చేసి వ్యాపారం చేసే పరిశ్రమలు మూతపడతాయని జగన్ భయంతో ఉన్నారు. జగన్ పీపీఏలు రద్దు చేయడంతో ప్రజల సొమ్ము రూ.10 వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి శ్రమ వృథానే అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు నాయుడు ఒక్కడే.. జగన్ కుట్రలకు పుల్ స్టాప్ పెట్టేది చంద్రబాబు నాయుడేనని జగన్ గుర్తుపెట్టుకోవాలి. కుప్పం నియోజకవర్గానికి హిందాల్కో పరిశ్రమ తీసుకొచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ