ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో స్నానం కోసం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ 23 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యింది. బాత్రూమ్‌లోకి వెళ్లిన యువతి ఎంతకూ బయటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు తలుపులు నెట్టి చూసింది. లోపలి నుంచి గడియ వేసి ఉండటం, ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా చేతిలో హీటర్ పట్టుకుని విగతజీవిగా పడి ఉంది. మృతురాలు మణిపూర్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ షాక్‌తోనే యువతి చనిపోయినట్లు తాము ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
వాటర్ హీటర్‌తో కరెంట్ షాక్ తగిలి యువతి దుర్మరణం
الاثنين، 10 نوفمبر 2025
Criem delhi Mahipalpur police identified the deceased as a young woman from Manipur Young woman dies after getting electrocuted by water heater
ليست هناك تعليقات:
إرسال تعليق