ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. తుమ్మలపాడ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. దాంతో స్థానిక పోలీసులతోపాటు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయని వివరించారు. ఈ విషయాన్ని మావోయిస్టులు గమనించి.. కూంబింగ్ నిర్వహిస్తున్న వీరిపై కాల్పులకు తెగబడ్డారన్నారు. దాంతో భద్రతా బలగాలతోపాటు పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని.. దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయని వివరించారు. అనంతరం మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాని తెలిపారు. దాంతో ఆ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే భారీగా ఆయుధాలను సైతం అక్కడి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయి ఉండ వచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టులపై రూ. 15 లక్షల రివార్డు ఉందని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
الأحد، 16 نوفمبر 2025
Bastar Range IG Sundar Raj said national Sukma district Three Maoists killed in Chhattisgarh encounter Two of them were female Maoists
ليست هناك تعليقات:
إرسال تعليق