తెలంగాణ లోని కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండా ఏసీబీ అధికారులు రావడంతో గమనించిన పౌరసరపరాల అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా ఏసిబి డిఎస్పి మధు తెలిపిన వివరాల ప్రకారం దహేగాంకు చెందిన వాసవి మోడ్రన్ రైస్ మిల్ నుండి సిఎంఆర్ బియ్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు పౌరసరఫాల డీఎం నర్సింగరావు ఒక్కో లారీకి రూ.25వేల లంచం డిమాండ్ చేశాడు. ఇక గురువారం సాయంత్రం రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద బాధితుడు మూడు లారీలకు సంబంధించిన రూ. 75 వేలను అధికారికి ఇస్తుండగా ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నర్సింగరావు తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాధితుడు నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతో పాటు లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురిచేస్తే 1064, 9154388963 (ఆదిలాబాద్ ఏసిబి డిఎస్పి ) కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ పౌరసరపరాల అధికారి
الجمعة، 7 نوفمبر 2025
Civil Supplies DM Narsinga Rao Civil Supplies Officer Caught by ACB While Taking Bribe on Nadi Road Criem Komrambheem Asifabad district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق