అమెరికాలో వెంకటేశ్ గర్గ్, భానూ రాణా అనే ఇద్దరు కరుడుగట్టిన గ్యాంగస్టర్‌ను అరెస్టయ్యారు. భారత భద్రతా సంస్థలు, హర్యానా పోలీసులు సంయుక్తంగా పకడ్బందీ ప్లాన్ వేయడంతో నిందితులు దొరికారు. త్వరలో ఇద్దరినీ భారత్‌కు తరలించనున్నారు హర్యానాలోని నారాయన్‌గఢ్‌కు చెందిన గర్గ్ భారత్‌లో పదికిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. హర్యానాతో పాటు రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో వసూళ్ల దందా నిర్వహించేవాడు. రౌడీషీటర్ల సాయంతో బలవంతపు వసూళ్లకు దిగేవాడు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఓ నేత హత్య కేసులో నిందితుడి ఉన్న అతడు అమెరికాకు పారిపోయాడు. జార్జియాలో అతిడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అమెరికాలోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి అతడు భారత్‌లో ఓ క్రిమినల్ గ్యాంగ్‌ను నిర్వహిస్తూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. కొంతకాలం క్రితం సంగ్వాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు ఓ బిల్డర్ ఇంట్లో కాల్పులకు దిగారు. అక్టోబర్‌లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన భానూ రాణా కూడా కొంతకాలంగా అమెరికాలో ఉంటూ భారత్‌లో క్రిమినల్ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం కానా. హర్యానా పంజాబ్, ఢిల్లీలో అతడి క్రిమినల్ కార్యకలాపాలు విస్తరించాయి. ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. పంజాబ్‌లో జరిగిన ఓ గ్రెనేడ్ దాడిలో రాణా పేరు తెరపైకి వచ్చింది. జూన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కర్నాల్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లను అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి హ్యాండ్ గ్రెనేడ్‌లు, పిస్టల్స్, తూటాలు స్వాధీనం చేసుకున్నాయి. వారు రాణాకు చెందిన వారని పోలీసులు వర్గాలు తెలిపాయి.
అమెరికాలో కరుడుగట్టిన ఇద్దరు భారతీయ గ్యాంగ్‌స్టర్స్ అరెస్టు
الأحد، 9 نوفمبر 2025
Both will be deported to India soon Two Indian gangsters arrested in America Venkatesh Garg and Bhanu Rana
ليست هناك تعليقات:
إرسال تعليق