భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ లో నేడు జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికే హల్దీ కార్యక్రమం ముగిసింది. పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను హుటాహుటిన సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. పెళ్లి నిరవధికంగా వాయిదా పడిన విషయాన్ని స్మృతి మంధాన మేనేజర్ ధృవీకరించారు. ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారని, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. ఇంతకుమించిన ఊహాగానాలకు అవకాశం లేదని, కష్ట సమయంలో ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. స్మృతి మంధాన- పలష్ ముచ్ఛల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. మరో కొత్త తేదీని వెల్లడించేంత వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేశారు.ప్రస్తుతం స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలు ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా సాంగ్లీ అంతటా సందడి వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి హల్దీ కార్యక్రమం సైతం ముగిసింది. 2019 నుండి ప్రేమలో ఉన్నఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడం, మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడమే ఆలస్యం అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అందర్నీ దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది.
0 Comments