భారతీయులకు దక్షిణ రష్యాలోని కాకస్ పర్వతాలలో లభించే నేచురల్ మినరల్ వాటర్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరికల్లా మినరల్ వాటర్ అందుబాటులోకి రానున్నట్లు వార్తసంస్థ పీటీఐ పేర్కొంది. రష్యాకు చెందిన ప్రముఖ ఆక్వా హోల్డింగ్ కంపెనీ ఈ నేచురల్ మినరల్ వాటర్‌ను ఎగుమతి చేస్తుంది. రష్యా నుండి అమెరికా, కెనడా, చైనా, ఇజ్రాయెల్ , దక్షిణ కొరియాతో సహా 20 కి పైగా దేశాలకు ఈ వాటర్‌ను ఎగుమతి చేస్తున్నారు. భారతదేశానికి ఇప్పటికే ఈ సహజసిద్ధమైన మినరల్ వాటర్‌ను రవాణా చేసారు. గోర్జి విటా బ్రాండును కంపెనీ ఈ నేచురల్ మినరల్ వాటర్‌ను రూపొందించింది. రష్యాలోని కాకస్ పర్వతాలలో లభించే ఈ కకేసియన్ మినరల్ వాటర్, ఎంతో సహజసిద్దమైనవిగా చెబుతారు. ఇక్కడ లభించే ఈ మంచినీరు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఆధునిక వైద్య పరికరాలతో కూడిన 100కు పైగా స్పా రిసార్ట్స్ కంటే ఎంతో మెరుగైనవిగా చెబుతారు.1803లో అలెగ్జాండర్ చక్రవర్తి అలెగ్జాండర్ I కాకేసియన్ ఇక్కడ లభించిన మినరల్ వాటర్‌లను వైద్యంకోసం ఉపయోగించినట్లుగా చెబుతారు. కాకస్ పర్వతాలలో లభించే ఈ నేచురల్ మినరల్ వాటర్ ధరకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ అల్ట్రా-ప్రీమియం వాటర్‌ను ఉత్తర ధ్రువానికి సమీపంలోని స్వాల్‌బార్డ్ చుట్టూ ఉన్న ఫ్జోర్డ్‌లలో కరుగుతున్న మంచుకొండల నుండి సేకరిస్తారు. ప్రతి బాటిల్‌లో 4,000 సంవత్సరాల పురాతనమైన స్వచ్ఛమైన నీరు ఉంటుందని, పరిమితమైన మోతాదులో సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే ఈ నీటిని సేకరిస్తారని చెబుతారు. ఈ వాటర్ ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటుందని చెబుతారు. గిఫ్ట్ ట్యూబ్‌తో కూడిన సాధారణ 750ml బాటిల్ ధర సుమారు రూ.9,195 ఉంటుంది. ఈ బ్రాండ్‌లోని కలెక్టర్స్ జాడే స్పెషల్ ఎడిషన్ సుమారు రూ. 5,52,000కు అమ్ముడైంది. ఈ జపనీస్ లగ్జరీ వాటర్ డ్రింక్ ఎంతో ప్రసిద్ధి చెందినది. బంగారం,స్వరోవ్స్కీ స్ఫటికాలతో బాటిల్ నెక్‌ను స్పెషల్‌గా అలంకరించిన, ఈ శాటిన్-గ్లాస్ కంటైనర్...అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్,మద్యం బాటిల్స్ ఆకారంలో ఉంటుంది. దీంతో సాధారణ మినరల్ వాటర్, ఎంతో అలంకారమైన వస్తువుగా కనిపిస్తుంది. సాధారణంగా దీనిని బహుమతిగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. బ్లాక్ కింగ్ ఎడిషన్ ఒక్క బాటిల్ ధర సుమారు రూ.3,44,736 వరకు ఉంటుంది. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బాటిల్ వాడటంతో, దీనికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బ్లింగ్ H2O బాటిళ్లు స్వరోవ్స్కీ క్రిస్టల్స్ తో తయారు చేయడతాయి. దీనినే "బ్లింగ్" అని పిలుస్తారు. "Clear Blue" మరియు ఇతర కొన్ని లిమిటెడ్ ఎడిషన్స్ పాప్ కల్చర్ ప్రియులకు ఎంతో ఇష్టమైనవి. ఈ వాటర్ బాటిల్ 750ml కస్టమ్ ఎడిషన్ ధర సుమారు రూ.2,26,800గా ఉంది.
0 Comments