హెయిర్ కటింగ్ మెషిన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన తలను ఆ మెషిన్‌లో ఉంచిన కొన్ని సెకన్లలోనే పర్ఫెక్ట్ హెయిర్ కట్టింగ్ పూర్తవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి పొడవాటి జుట్టుతో ఈ హెయిర్ కట్టింగ్ తో ఒక ప్రత్యేకమైన మెషీన్ వద్ద నిలబడి ఉన్నాడు. చూసేందుకు ఆ యంత్రం పాతకాలం నాటి ఫోటో కెమెరాలాగా కనిపిస్తుంది. అతడు తన తలను ఆ యంత్రం లోపలికి దూర్చాడు. అంతే కొన్ని సెకన్లలో అతనికి అందమైన హెయిర్ స్టైల్ పూర్తైంది. అతను తన తలని యంత్రం లోపల పెట్టే ముందు ఇలా చెబుతున్నాడు. మీరు ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు. ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు వంటి సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత, యంత్రం మీకు డబ్బు ఇస్తుంది. ఈ యంత్రం కూడా అదే విధంగా పనిచేస్తుందని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ 10 సెకన్ల వీడియోను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తున్నారు. ఈ వీడియోను @Sheetal2242 అనే అనామక ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఇది భవిష్యత్తులో త్వరగా అందుబాటులోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. హెయిర్ కటింగ్ మెషిన్ ఇది మీకు కేవలం 5 సెకన్లలో పర్ఫెక్ట్ కట్ ఇస్తుంది. అని రాశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 141,000 మందికి పైగా వీక్షించారు. ప్రతి ఒక్కరూ వీడియోపై కామెంట్ చేశారు. భవిష్యత్తులో ఇది వచ్చినా, దాంతో హెయిర్ కట్‌ను ఎవరు రిస్క్ చేస్తారు? మీరు అనుకోకుండా మీ చెవులు, ముక్కు లేదా గొంతు కోసుకుంటే? ఎవరిది బాధ్యత అంటున్నారు కొందరు. భవిష్యత్తులో బార్బర్లకు కష్టాలు తప్పేలా లేవని మరికొందరు రాశారు. అలాగే, చాలా మంది ఇది నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తం చేశారు.
క్షణాల్లో హెయిర్ కటింగ్ చేసే మెషిన్ : ఇంటర్నెట్‌లో వీడియో వైరల్
الخميس، 13 نوفمبر 2025
000 people so far Hair Cutting Machine in Seconds shared online by an anonymous account named @Sheetal2242 technology this video has been viewed by more than 141 Video Viral on the Internet
ليست هناك تعليقات:
إرسال تعليق